Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ 'బార్బీక్యూ నేషన్స్‌'లో ఫుడ్ గురించి వింటే అంతే!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (09:25 IST)
విజయవాడలోని బార్బీక్యూ నేషన్‌ రెస్టారెంట్‌లో పుడ్‌ సేఫ్టీ, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో పలు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. రెస్టారెంట్లో పాచిపోయిన, గడువు దాటిన స్వీట్స్‌ వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కనీసం కరోనా నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విజిలెన్స్‌ ఎస్‌పి కనకరాజు, ఫుడ్‌ సేఫ్టీ అధికారి పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ.. గడువు దాటిన ఉత్పత్తులు అమ్ముతున్నారంటూ కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో బార్బీక్యూ నేషన్స్‌ రెస్టారెంట్‌పై దాడులు చేసినట్లు తెలిపారు.

నిల్వ ఉన్న 1500 కిలోల మటన్‌ను, పాచిపోయిన ఆహార పదార్ధాలు సరఫరా చేస్టున్నట్లు, ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నట్లు గుర్తించామన్నారు. ఎంతోకాలంగా నిల్వ ఉంచిన 20 హల్వా ప్యాకెట్లను గుర్తించామన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఫ్రీజర్‌లో పెట్టి కస్టమర్‌కు సర్వ్‌ చేస్తున్నట్లు తేలిందన్నారు.

హోటల్‌లో కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రెస్టారెంట్‌లో కొన్ని సాంపిల్స్‌ సేకరించామని, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి రిపోర్టుల ఆధారంగా రెస్టారెంట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments