Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ ప్రకాశం బ్యారేజి దర్గా తొలగింపుకు కుట్ర!

విజయవాడ ప్రకాశం బ్యారేజి దర్గా తొలగింపుకు కుట్ర!
, బుధవారం, 14 అక్టోబరు 2020 (21:24 IST)
450 ఏళ్ళు గా విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలో వున్న హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ , హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గాల తొలగింపునకు కుట్రలు చేస్తే సహించేది లేదని సూఫీ మతగురువులు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రాజా హెచ్చరించారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజి  సమీపంలో వున్న హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ , హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గా వద్ద దర్గాపై అనుసరిస్తున్న వివక్షకు నిరసనగా 116 కొబ్బరి కాయలు కొట్టి నిరసన తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అతి పవిత్రమైన ఈ దర్గాలలోనికి మురగు నీరు వర్షపు నీటితో నమాజు చేసుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్గా లోపలికి వెళ్ళే దారికూడ లేకుండా గోడలు కట్టేశారన్నారు.

నాలుగు ఏళ్ళ కిందట దర్గా తొలగింపునకు నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుట్ర జరిపిందని  దానిని హైకోర్టులో అడ్డుకున్నామని అన్నారు.ఆ తరువాత రూ68.75 లక్షలలతో దర్గా అభివృద్ధి కేటాయించి  పైసా ఖర్చు చేయలేదన్నారు.

ఏమి చేయలేని పరిస్థితిలో డ్రైనేజీ నీరు లోనికి చోచ్చుకు వచ్చే విధంగా పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈవిషయమై ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖా మంత్రి అంజాద్ బాషా దృష్టికి తీసుకెళ్ళగా ఆయన స్పందించి తక్షణమే జిల్లా కలెక్టర్, వక్ఫ్ బోర్డు సిఇఓ ల ఆర్ అండ్ బి దృష్టికి తీసుకళ్ళారని అన్నారు.

సాక్షాత్తు మైనారిటీ శాఖా మంత్రి అంజాద్ బాషా సూచించినా  పట్టించుకోలేదన్నారు.ఇలాంటి పరిస్థితిల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోని హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ, హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గాలను అభివృద్ధి చేయాలని కోరారు.దర్గాల జోలికి వస్తే కుట్ర దారులకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
 
అనంతరం సూఫీ హజరత్ నజిరుద్దీన్ బాబా మాట్లాడుతూ మత సమరస్యానికి నెలవైన విజయవాడ నగరం లో ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని,మసీదు రక్షణకు అందరూ కదలాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు కొబ్బరి కాయలు కొట్టి నిరసనను తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభానాయుడు మృతి పట్ల ఏపి గవర్నర్ సంతాపం