Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు నాకు సంబంధం లేదు... నేను మాత్రం టీడీపీలోనే : టీజీ తనయుడు

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (11:13 IST)
తన తండ్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని టీజీ వెంకటేష్ తనయుడు టీడీ భరత్ స్పష్టంచేశారు. 
 
ఇటీవల టీడీపీకి చెందిన టీజీ వెంకటేష్‌తో పాటు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరిలు వంటి నేతలు పార్టీ మారడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన తండ్రి బాటలోనే టీజీ భరత్ కూడా పయనిస్తారనే ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనిపై భరత్ స్పందించారు. తన తండ్రి బీజేపీలో చేరుతున్నట్టు తనకు ఢిల్లీ నుంచి ఫోనులో చెప్పారన్నారు. అయితే, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. 
 
ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిపారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకం ఉంచి టిక్కెట్‌ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు కేటాయించారని గుర్తుచేశారు. త్వరలోనే చంద్రబాబు, నారా లోకేశ్‌లను కలిసి అన్ని విషయాలు మాట్లాడుతానని టీజీ భరత్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments