Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలుగు యాత్రికులు

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:43 IST)
లాక్‌డౌన్‌ పొడిగింపుతో రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ యాత్రకు వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన 80 మంది చిక్కుకుపోయారు.

తమను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి అజ్మీర్ యాత్రలో చిక్కుకున్న 80 మంది తెలుగు యాత్రికులు విజ్ఞప్తి చేశారు. తమను తమ సొంత ఊళ్లకు చేర్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. 

చిత్తూరు, తిరుపతి, పాకాల, దామలచెరువు, కల్లూరు ప్రాంతాలకు చెందిన 80 మంది ముస్లింలు అజ్మీర్ యాత్రకు వెళ్లారు. మార్చి 13వ తేదీన రాజస్థాన్‌లోని అజ్మీర్ యాత్రకు వెళ్లారు.

సడన్‌గా లాక్‌డౌన్ విధించడంతో తాము అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్నామని వారు తెలిపారు. స్థానికంగా ఓ సత్రంలో తలదాచుకుంటూ, చేతిలో డబ్బులు మొత్తం పూర్తిగా ఖర్చయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపుతో తామంతా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

యాత్రకు వెళ్లిన వ్యక్తుల్లో చిన్నపిల్లలు , వృద్ధులు, రకరకాలైన వ్యాధిగ్రస్తులు ఉన్నందున మరింత ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు.

ఇది వరకే తమ పరిస్థితి గురించి జిల్లా పోలీసులకు తెలియజేశామని, అయినప్పటికి ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్టికైనా ప్రభుత్వం పట్టించుకోని తమను తమ సొంత ఊళ్లకు చేర్చే చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంటున్నామని బాధితులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments