Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

దేశానికి అత్యున్నత రాజ్యాంగం అందించిన అంబేద్కర్: రాజ్ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుక

Advertiesment
AP Governor
, మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:28 IST)
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్ అంబేద్కర్‌కు భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడుగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉంటారన్నారు. 
 
భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్‌లో నివాళి అర్పించారు. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా విశ్వరూపం... 24 గంటల్లో 1463 కేసులు