Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్టాండులో ఒంటరిగా కనిపించిన యువతి... లాడ్జీకి తీసుకెళ్లిన పోలీస్....

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండులో ఓ యువతి ఒంటరిగా కనిపించింది. దీంతో ఆ యువతిని గమనించిన ఓ కానిస్టేబుల్ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఇది వివాదానికి దారితీసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యువతి తన సొంతూరుకు వెళ్లేందుదుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నిర్మల్‌కు చేరుకుంది. అయితే, ఆమె అక్కడకు చేరుకునేందుకు సొంతూరుకు వెళ్లే ఆఖరి బస్సు కూడా వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయింది. ఆ సమయంలో రాత్రి విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ యువతిని గమనించి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. 
 
తాను ఆశ్రయం కల్పిస్తానంటూ యువతిని కానిస్టేబుల్ లాడ్జికి తీసుకువెళ్లాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాడ్జి గదిలో యువతితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేమి తెలియదని, పోలీస్ తనను గదిలో ఉంచారని యువతి చెప్పింది. ఈ వ్యవహారంపై పోలీస్ కానిస్టేబుల్ వద్ద పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments