Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిశువుపై అత్యాచారం... ఆ పాప ఏంచేసిందంటూ రేష్మీ ట్వీట్

Advertiesment
శిశువుపై అత్యాచారం... ఆ పాప ఏంచేసిందంటూ రేష్మీ ట్వీట్
, ఆదివారం, 23 జూన్ 2019 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో తొమ్మిది నెలల శిశువుపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ తీవ్రంగా స్పందించింది. తొమ్మిది నెలల చిన్నారి ఏం చేసిందంటూ ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నించారు. 
 
ఇటీవల హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనిపై రష్మీ గౌతమ్ స్పందించారు. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెల‌ల పాప ఏం బ‌ట్ట‌లు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నించింది. రష్మీ గౌతమ్ అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఆమెకు మద్దతుగా నిలబడి, ఆ కామాంధుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ ఓ కామాంధుడు... అత్యాచారం చేశాడంటూ రచయిత్రి ఆరోపణ