Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాషాయం వైపు కోమటిరెడ్డి... మరో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు కూడా...

కాషాయం వైపు కోమటిరెడ్డి... మరో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు కూడా...
, ఆదివారం, 23 జూన్ 2019 (15:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, కీలక నేతలను తమలో చేర్చుకుంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ్యులతో పాటు... తెలంగాణ ప్రాంతానికి గరికపాటి మోహన్ రావు (టీడీపీ)లు బీజేపీలో చేరిపోయారు. 
 
తాజాగా, తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరనున్నారు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో చేరేందుకు సర్వే సిద్ధమయ్యారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, కీలకనేత రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీలో చేరే టీమ్‌లో ఆయన ఉన్నారని తెలుస్తోంది. 
 
అయితే ఈ చేరికలపై బలరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. అయితే తాను మాత్రం పార్టీ మారడానికి సిద్ధంగా లేనని.. ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని బలరాం నాయక్‌ చెప్పుకొచ్చారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేపిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారాంతాన్ని ఎంజాయ్ చేయొద్దంటే ఎలా? మందెక్కువై నడిరోడ్డుపై యువతుల హల్‌చల్