అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట - అరెస్టుకు బ్రేక్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (15:36 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్.అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట లభించించింది. ఈ కేసులో ఆయన్ను సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ సీబీఐకు హైకోర్టు శనివారం ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో కేసు పూర్తి వివరాలను సోమవారం సమర్పించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలని, తనను అరెస్టు చేయకుండా సీబీఐను అరెస్టు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణపై శనివారం విచారణ జరిపిన కోర్టు... సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అదేసమయంలో ఈ కేసు విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది.
 
అంతకుముందు అవినాశ్ రెడ్డి హైకోర్టులో... 
వైకాపా నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలంటూ ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైకాపా నేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తన పట్ల అరెస్టు వంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. 
 
వివేకా హత్య కేసులో మరోమారు విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఆరో తేదీన హైదరాబాద్ నగరంలోని తమ సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందువల్ల హాజరుకాలేనని బదులిచ్చారు. దీంతో 10వ తేదీన రావాలంటూ మరోమారు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం సీబీఐ విచారణకు హాజరుకావాల్సివుది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేసేలా సీబీఐని అదేశించాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా అవినాశ్ రెడ్డి తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments