Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి హీరో కోసం మూడేళ్ళుగా పెళ్ళి వాయిదా?

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (15:00 IST)
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి హీరోలు అంటే వల్లమాలిన అభిమానం ఉన్న ఫ్యాన్స్ అనేక మంది ఉన్నారు. వీరిలో కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటే, మరికొందరు మరోరకమైన అభిమానులు ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకడు పెద్దినాయుడు. గత 2019 నుంచి పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నాడు. అయితే, పెళ్లికి అతిథిగా నందమూరి హీరో బాలకృష్ణ రావాలన్నది ఆయన కోరిక. ముహూర్త సమయానికి బాలకృష్ణ రాలేకపోతుండటంతో పెద్దినాయుడు పెళ్లి గత మూడేళ్ళుగా వాయిదాపడుతూ వస్తుంది. 
 
బాలయ్యను అమితంగా ప్రేమించే పెద్దినాయుడు అనే వీరాభిమాని సొంతూరు విశాఖపట్టణం. ఆయనకు గౌతమీ ప్రియ అనే అమ్మాయితో గత 2019లో నిశ్చితార్థం జరిగింది. గౌతమి కూడా బాలకృష్ణ అభిమాని కావడంతో వారిద్దరూ తమ అభిమాన హీరో బాలకృష్ణ సమక్షంలో దంపతులుగా మారాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో తమ వెడ్డింగ్ కార్డును గత 2019లో వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలకృష్ణకు పంపించారు.


అయితే, వివిధ రకాలైన కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నట్టు సమాచారం అందించారు. దీంతో పెద్దినాయుడు - గౌతమి కూడా తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా ఆయన పెళ్లికి మరో ముహూర్తం కుదుర్చుకున్నారు. ఈ సారైనా బాలయ్య వస్తారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఊరంతా సిద్ధమవుతున్నారట. మరి బాలకృష్ణ ఈ సారైనా వస్తారో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments