Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన మేకలు.. ఫైన్ వేసిన పోలీసులు.. ఎలా.. ఎక్కడ?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రెండు మేకలకు పోలీసులు జరిమానా విధించారు. ఈ మేకలు చేసిన నేరమేంటో తెలుసా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు. ఇంతకు ఆ మేకలు ప్రభుత్వ ఆస్తులను ఎలా ధ్వంసం చేశాయో తెలుసుకుందాం. 
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో స్థానికంగా పని చేసే సేవ్ ది ట్రీస్ అనే ఓ ఎన్జీవో సంస్థ సుమారుగా వెయ్యి మొక్కలను నాటింది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు మేకలు ఆ మొక్కల్లో 280 నుంచి 300 మొక్కలను మేశాయి. వీటిలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కలను ప్రభుత్వ ఆస్తులుగా పోలీసులు పరిగణించారు. 
 
ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను ఎన్జీవో సభ్యులు పట్టుకెళ్లి పోలీసు అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్‌కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను విడిపించుకుని వెళ్లారు. మొత్తంమీద ఈ సంఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments