Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే వెబ్‌సైట్లలో సాంకేతిక లోపం.. నిలిచిన టిక్కెట్ల బుకింగ్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:31 IST)
తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు ఒక్కసారిగా యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
శుక్రవారం అక్టోబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. అక్టోబర్‌ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌ సర్వర్లు మొరాయించాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా వెబ్‌సైట్లు మొరాయించాయి. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. జియో సర్వర్‌తో అనుసంధానించినప్పటికీ తిరిగి మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. 
 
దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై తితిదే ప్రకటన చేసే అవకాశముంది. కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకుని వెళ్ళాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments