Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు... నేటి నుంచీ ఐదేళ్ళ పదవీకాలం

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తాజాగా ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయగా, పోలింగ్‌ 2021 ఏప్రిల్‌ 8న, కౌంటింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 19వ తేదీన ముగిశాయి.
 
మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దాదాపు అత్య‌ధిక జెడ్పీల‌ను, మండ‌లాల‌ను వైసీపీ కైవ‌శం చేసుకుంది. మెజారిటీ సీట్లు ఎక్కువ‌గా వైసీపీకి రావ‌డంతో ఎక్క‌డా కూడా మండ‌లాధ్య‌క్ష‌, జెడ్పీ పీఠాల కోసం కుమ్ములాట‌లు లేవు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల మ‌ధ్య మెజారిటీ తేడా ఎక్కువ‌గా ఉండ‌టంతో అంతా స‌జావుగా సాగిపోయింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments