Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు రోడ్డెక్కారు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (19:39 IST)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు రోడ్డు ఎక్కవలసిన దుస్థితి ఏర్పడింది. తమ సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఆందోళన బాట పట్టారు. 
 
ముఖ్యమంత్రి తన స్వహస్తాలతో బదిలీల ఫైల్‌ను పంపించమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  విద్యశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ 23.06. 2020 న బదిలీలకు సంబంధించిన మెమోను కళాశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపినప్పటికీ, నేటికీ కూడా ఆ ఫైలుకు మోక్షం రాలేదు. గత 7, 8 సంవత్సరాలుగా అనేక మంది అధ్యాపకులు ఏజెన్సీ ప్రాంతాలలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పనిచేస్తున్నారు. 
 
స్పౌసల్ (భార్య లేదా భర్త) మరియు మెడికల్ (అనారోగ్యం) తదితర ఇబ్బందులతో బదిలీల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. వీరికి గత నాలుగు సంవత్సరాలుగా బదిలీలు జరగకపోవడం వలన అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.  అదేవిధంగా అధ్యాపకులకు సంబంధించిన యుజిసి బకాయిలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా జూన్ మాసంలో విడుదలయ్యాయి. 
 
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారు దానికి సంబంధించిన వివరాలు పంపించాలని సెప్టెంబర్ 2020లో మెమో పంపించినారు, కానీ నేటికీ కూడా సీసీఈ నుండి ఆ వివరాలు  పంపలేదు. అధికారుల వైఖరి వలన అధ్యాపకులకు నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంఫిల్, పీహెచ్‌డి అర్హతగల వారికి అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయుటకు అనుమతిని సెప్టెంబర్ 2019 ప్రభుత్వము మెమో జారీ చేయడం జరిగింది. 
 
ఉత్తర్వులను నేటి వరకు కూడా కళాశాలలకు పంపక పోవడం వలన అనేక మంది అధ్యాపకులు ఇబ్బందులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్లు గా రీ- డీసిగ్నేషన్ చేయడం జరిగింది, కానీ మన రాష్ట్రంలో జీవో నెంబర్14 మరియు జీవో నెంబర్ 38 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు.
 
2015 -16 విద్యాసంవత్సరం నుంచి cbcs విద్యా విధానం అమలు చేయడం వలన పనిదినాలు పెరగడం జరిగింది. ఆ పెరిగిన పని దినాలకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని,  నష్టపోయిన వేసవి సెలవులకు గాను ఆర్జిత సెలవులు మంజూరు చేయుట ద్వారా  భర్తీ చేయాలని కోరినప్పటికీ ఫలితం శూన్యం. డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు ప్రమోషన్ నిమిత్తం CAS ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరినప్పటికీ సీసీఈ వారు పట్టించుకోవడం లేదు.
 
 
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కోవిడ్ సమయంలో విద్యార్థులు నష్టపోకూడదనే ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2020 వరకు సుమారు 25 వేలకు పైగా తరగతులను విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా బోధించడం జరిగింది. వేసవి సెలవులలో సైతం అధ్యాపకులు విద్యార్థుల ప్రయోజనం కోసం కష్టపడి పని చేశారు. అధ్యాపకులు 3000 పైచిలుకు వీడియో తరగతులు తయారుచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అధ్యాపకుల కృషి వలన ఆన్లైన్ బోధనలో మన రాష్ట్రం దేశం మొత్తం మీద మొదటి స్థానంలో నిలిచింది. ఇదిఅధ్యాపకుల కృషి వల్లనే సాధ్యమైంది. 
 
అధ్యాపకులు ఇంత కృషి చేస్తున్నప్పటికీ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. నవంబర్ 18,  2020 నా మరియు డిసెంబర్ 31, 2020 న కళాశాల స్థాయిలో ఆందోళన నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. అయినా కూడా ఫలితం కనపడకపోయేసరికి 21 జనవరి 2021 నా విజయవాడలోని ధర్నా చౌక్ లో మహాధర్నా చేపడుతున్నారు. 
 
ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీలు, అధ్యాపక సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు పాల్గొంటాయని జిసిజిటిఏ ప్రధాన కార్యదర్శి శ్రీ ఏ ఆర్ చంద్రశేఖర్,  జిసిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వేణుగోపాల్ మరియు ఇతర సంఘ నాయకులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని సంఘాలు కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments