Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లిన ఇన్విజిలేటర్?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:30 IST)
పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఓ ఇన్విజిలేటర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సూర్యాపేటలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక అరవై అడుగుల రోడ్డులో గల ఒక ప్రైవేటు పాఠశాలలో మంగళవారం పదో తరగతి పరీక్ష రాసింది. 
 
సూర్యాపేట మండలంలోని ఓ తండాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదే ప్రైవేట్ పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా విధుల్లో ఉన్నాడు. బాలిక పరీక్షలో చూసి రాసేందుకు కొంత సహకారం అందించి, ఏవేవో మాటలు చెప్పి పరీక్ష పూర్తయ్యాక కేంద్రం బయట వేచి ఉండాలని ఆమెకు సూచించాడు.
 
బాలికను ఇంటివద్ద దింపుతానని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక అక్కడి నుంచి అతి కష్టంమీద తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన పెద్దమ్మకు వివరించింది. బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. బాలిక పెద్దమ్మ 100 నంబరుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. 
 
పోలీసులు టీచర్‌ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడి తరఫున రంగంలోకి దిగిన పెద్ద మనుషులు బాలిక బంధువులకు నచ్చజెప్పారు. పెద్దమనుషులు బాధితులకు కొంత నగదు ముట్టజెప్పి విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారని తెలిసింది. ఫిర్యాదు ఇవ్వాలని కోరినా కుటుంబసభ్యులు ఎవరూ  ముందుకు రావడం లేదని సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments