Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు కూడా.. కేశినేని నాని ట్వీట్ల కలకలం

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (10:57 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇపుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని విషయాలను బహిర్గతం చేస్తున్నాడు. 
 
తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇపుడు టీడీపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. "నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు… నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు... నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు" అంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కృష్ణా జిల్లా నేతలు మాత్రం ఒకరిపై ఒకరు టార్గెట్ చేసుకోవడం టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా బయటపెడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీడీపీలో షో మ్యాన్‌లు అవసరం లేదంటూ నాని వ్యాఖ్యానించి కలకలంరేపారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్.. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను ఉద్దేశించి చేసినవై ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments