Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలోకి మరో తెలుగుదేశం ఎంపీ? నేడో రేపో తీర్థం...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (18:51 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా, అధికార పార్టీలో కీలకంగా ఉండి గత ఐదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన అనేక మంది నేతలతో పాటు.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని భావించిన పలువురు నేతలు వైకాపాలో చేరేందుకు క్యూ కడుతున్నారు. 
 
ఈ కోవలో ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు ఉన్నారు. వీరిద్దరూ టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరిపోయారు. ముఖ్యంగా, అవంతి శ్రీనివాస్ గురువారం పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి జగన్ చెంతకు చేరారు. 
 
ఈ పరిణామంతో తెదేపా శ్రేణుల్లో దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చిన అవంతి శ్రీనివాస్ రాత్రికిరాత్రే పార్టీ మారడంతో టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, మరో టీడీపీ ఎంపీ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పేరు రవీంద్రబాబు. ఈయన అమలాపురం లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన ఒకటి రెండు రోజుల్లో జగన్‌ను కలిసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవీంద్ర బాబు పార్టీలోనే ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. 
 
అలాగే, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై కూడా ఎంపీ రవీంధ్రబాబు స్పందించారు. ఇవన్నీ గాలి వార్తలేనని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. పైగా, తనపై కుట్రపూరితంగానే దుష్ప్రచారం సాగుతోందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments