Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబోరేట‌రీ వద్ద టీడీపీ ప్ర‌ద‌ర్శ‌న‌

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:37 IST)
ఏపీ టీడీపీ నేత‌లు హైద‌రాబాదులోని సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబోరేట‌రీ వద్ద ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భానుకి విసిరిన డ్ర‌గ్స్ చాలెంజ్ మేర‌కు మల్కాజ్‌గిరి పార్లమెంట్, ఉప్పల్ నియోజకవర్గంలోని సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబోర్టరి వద్ద డ్రగ్స్ టెస్టుకు హాజరైన తెలుగుదేశం పార్టీ యువనాయకులు తాము డ్ర‌గ్స్ ఛాలెంజ్ చేస్తున్నామ‌ని, దానిని వైసీపీ నేత‌లు స్వీక‌రించాల‌న్నారు.
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జ‌రుగుతోంద‌ని, తెలంగాణ సరిహద్దుల్లో గంజాయితో పట్టుబడ్డ ఓ ప్రజా ప్రతినిధి కుమారుడి వ్యవహారం వెలుగులోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను కు, వైసీపీ నాయకులకు విసిరిన డ్రగ్ ఛాలెంజ్ ఇది అని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామ రాజు, ఎస్.సి. సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం.ఎస్ రాజు, టిఎన్ఎస్ఎఫ్  రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగుయువత నాయకులు బండారు వంశీకృష్ణ లతో కలిసి ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments