Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపురంలో అక్ర‌మ మట్టి తవ్వకాలను ఆపండి...

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:25 IST)
పైనాపురంలో అక్ర‌మ మట్టి తవ్వకాలను ఆపాల‌ని, ముత్తుకూరు అధికారులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముత్తుకూరు మండల టీడీపీ నాయకుల ఫిర్యాదుతో స్పందించి, ఈ చర్యల‌ను తీసుకున్నారు. ముత్తుకురు మండలంలోని పైనాపురం చెరువులో గత కొంత కాలంగా యథేచ్చగా మట్టి తవ్వకాలు, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీనితో జిల్లా ఇరిగేషన్ అధికారులను మండల టిడిపి నాయకులు నిల‌దీశారు.
 
 నెల్లూరు నగరంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఆ శాఖ ఎస్ఈకి అక్రమాలను వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల‌ను సైతం బేఖాత‌రు చేస్తూ, స్వలాభం కోసం వైసిపి నాయకుడు మట్టిని అక్రమంగా తరలించి డంప్ చేస్తున్నార‌ని, యథేచ్ఛగా అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తుంటే అధికారులు మిన్నకుండడం సిగ్గుచేటన్నారు. 460 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే పైనాపురం చెరువు కనుమరుగయ్యేలా మట్టి తవ్వకాలు జరుగుతున్నా స్పందించరా అని అధికారుల‌ను నిల‌దీశారు. 
 
త‌క్షణమే స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇరిగేష‌న్ అధికారులు హామీ ఇచ్చారు. పైనాపురం చెరువులో మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల పార్టీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు ఈపూరు మునిరెడ్డి, సీనియర్ నాయకులు ఏకొల్లు కోదండయ్య, విష్ణువర్ధన్ రావు, సురేష్ రెడ్డి, దీనయ్య, శ్రీధర్ రెడ్డి,మరియు కాంతారావు, జనార్దన్, శ్రీనివాసులు, ఏడుకొండలు, రమేష్, రాజేష్ ,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments