Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దాయికి సుప్రీంకోర్టుకు లేఖ రాసే అర్హత ఉందా? వర్ల రామయ్య ప్రశ్న

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:28 IST)
వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉంటూ బెయిల్‌పై బయటకు వచ్చి.. విచారణల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఓ మద్దాయి విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టుకు లేఖ రాసే అర్హత ఉందా అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 
 
ప్రతి శుక్రవారం కోర్టుమెట్లు ఎక్కే విజయసాయిరెడ్డి కోర్టు కంట్రోల్‌లో ఉన్నాడు. విజయసాయిరెడ్డికి స్వేచ్ఛ లేదు. ఒక ముద్దాయిగా బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసే అర్హత లేదు. అత్యున్నత న్యాయస్థానానికి లెటర్ రాసే అర్హత విజయసాయిరెడ్డికి లేదు. 
 
తన కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు లెటర్ రాసుకోవచ్చు కానీ వేరేవాళ్ళ విషయాలలో తల దూర్చకూడదు. బెయిల్ కేన్సిల్ అయితే ఏదో ఒక జైలుకు వెళ్ళాల్సిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టుకు లెటర్ రాయకూడదు. ప్రజా సమస్యల మీద పోరాడచ్చు, కానీ భారతదేశ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌కు లేఖ రాయకూడదు. 
 
యాక్టివ్‌గా ఉండే లీడర్ల మీద అసభ్యకర యూట్యూబ్ పోస్టింగ్లు పెడుతున్న ప్రభాకర్ రెడ్డి వైసిపికి ప్రచారంలో పాల్గొన్నాడు. అమెరికాలో ఉన్నాడని వదిలేస్తున్నారు పోలీసులు. ప్రభాకర్ రెడ్డి యూట్యూబ్ వేదికగా మాట్లాడిన మాటలు టిడిపి మహిళా నాయకురాలిని కించపరిచేలా ఉన్నాయి.

ఎన్నికల సమయంలో మీడియాలో డిబేట్లలో వైసిపి తరపున ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నాడు. అమెరికా నుంచి ప్రభాకర్ రెడ్డిని తీసుకురాలేరా పోలీసులు. ఫిర్యాదు ఇవ్వడానికి టిడిపి నాయకులు వస్తే పోలీసులే అందుబాటులో ఉండరు. రేపు ప్రభాకర్ రెడ్డి మీద గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం.

సోషల్ మీడియా విషయాలపై టిడిపి పెట్టిన 50వ కేసు అవుతుంది. కంప్లైంట్‌లు, అరెస్టులు మాత్రం శూన్యం. పంచుమర్తి‌ అనూరాధ మీద యూట్యూబ్ వేదికగా పోస్టింగ్ పెట్టిన, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి, అరెస్టు చేయాలి  అంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments