Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... పరిటాల సునీత

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (14:19 IST)
ఏపీలోని వైకాపా శ్రేణులు, నేతలకు మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత గట్టిహెచ్చరిక చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు మేమేంటో చూపిస్తామంటూ కామెంట్స్ చేశారు. తమలోకూడా సీమ రక్తమే ప్రవహిస్తుందనే విషయాన్ని వైకాప నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. 
 
ఏపీలో టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు జరుగుతున్న దాడులపై ఆమె స్పందించారు. నా భర్తను చంపినప్పుడు కూడా.. చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇక, ఇప్పటికైనా చంద్రబాబు మీరు మారాలి అంటూ పరిటాల సునీత సూచించారు..
 
ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇంకా ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం.. పార్టీ ఆఫీసు పక్కనే డీజీపీ కార్యాలయం ఉంది. గతంలో మేం పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైసీపీ గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదు అని వ్యాఖ్యానించారు. 
 
పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలో వచ్చాక శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారని గుర్తుచేసుకున్న ఆమె.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు. పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతోన్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదన్నారు. 
 
మారిన చంద్రబాబు కావాలి.. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. అధికారంలోకి వచ్చాక గంట కళ్లు మూసుకుంటే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా రక్తం ఉడుకుతోంది.. ఇప్పుడైనా సరే మీ పని మీరు చేయండని చెబితే మంత్రులను తిరగనివ్వం అని హెచ్చరించిన ఆమె… మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అంటూ పరిటాల సునీత వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments