Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారు : లంకా దినకర్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ సీఎంగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేత లంకా దినకర్ జోస్యం చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.10 వేల చొప్పున వన్ టైమ్ సెటిల్మెంట్ వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
ఈ వ్యవహారంపై ఏపీలో రగడ కొనసాగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌లో ఒకే మొత్తంలో రుణ బకాయిలు చెల్లించి జగనన్న సంపూర్ణ స్వగృహ పథకం ద్వారా లబ్దిదారులు ఇళ్ళపై పూర్తి హక్కులు పొందాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దీనిపై టీడీపీ నేత లంకా దినకర్ స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే వ్యాపారం ఎక్కువై పోయిందని చెప్పారు. సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాల పాత గృహ లబ్దిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్‌గా మారారని, ఈయన కూడా ఓటీఎస్ ముఖ్యమంత్రిగా మారిపోతారని లంకా దినకర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments