వేముల‌వాడ క్యూలైన్ లో భ‌క్తుల‌పై ఎలా దాడి చేస్తున్నారో చూడండి...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:45 IST)
దేవాల‌యానికి ఎవ‌రైనా దేనికి వ‌స్తారు?  ప్ర‌శాంతంగా దేముడికి న‌మ‌స్క‌రించి, త‌మను క‌ష్టాల గ‌ట్టెక్కించ‌మ‌ని మొక్కుకుంటారు... మొక్కుబ‌డులు చెల్లించుకుని, క‌రుణించ‌మ‌ని దేముడిని వేడుకుంటారు. అస‌లే క‌రోనా కాలం. భౌతిక దూరాన్ని పాటిస్తూ, క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల్సింది పోయి... ఏకంగా భ‌క్తుల‌పైనే దాడికి దిగిన ఈ భ‌ద్రతా సిబ్బంది దుశ్చ‌ర్య‌ల‌ను మీరే చూడండి. 
 
 
క‌రీంన‌గ‌ర్ జిల్లా వేములవాడ రాజ‌న్న దేవాలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులపై సిబ్బంది ఇలా దాడి చేశారు. క్యూలైన్ల‌ను నియంత్రిస్తున్నామ‌నే నెపంతో ఇలా సెక్యూరిటీ సిబ్బంది భక్తులపై దాడి చేసి భక్తులను మొక్కుబడులు చెల్లించనివ్వకుండా అరాచ‌కంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎదైనా ఆదుర్దాను భ‌క్తులు ప్ర‌ద‌ర్శిస్తే, వారికి స‌ర్ది చెప్పాల్సింది పోయి, క్యూలైన్ల‌ను స‌రిచేయాల్సింది పోయి, ఇలా భ‌క్తుల‌పైనే తెగ‌బ‌డి, క్యూలైన్ల‌లో చొర‌బ‌డి మ‌రీ బాద‌డం చూస్తూ, ఔరా క‌లియుగం అనిపించ‌క‌మాన‌దు.


భక్తుల  మనోభావాలను దెబ్బతీసేలా వేముల‌వాడ దేవస్థానం భ‌ద్ర‌త సిబ్బంది ప్ర‌వ‌ర్తించ‌డం దారుణ‌మ‌ని భ‌క్తులు తీవ్ర నిర‌స‌న తెలుపుతున్నారు. భ‌క్తుల‌పై దాడికి తెగ‌బ‌డిన భ‌ద్ర‌త సిబ్బందిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments