Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను వేధించిన టీడీపీ నేత ఇల్లు సీజ్

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (12:13 IST)
విజయవాడ నగరంలో టీడీపీ నేత వినోద్ జైన్  వేధింపులను తట్టుకోలేక తొమ్మిదేళ్ళ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వినోద్ జైన్‍ను విజయవాడ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నగరంలోని భవానీపురం కుమ్మరిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులోని నిందితుడి ఇంటిని విజయవాడ పోలీసులు సీజ్ చేశారు. 
 
కాగా, ఇటీవల విజయవాడ నగరంలో తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. 
 
పైగా, ఆ బాలిక కూడా చనిపోయే ముందు రాసిపెట్టిన ఆత్మహత్య లేఖలోనూ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లేఖ సంచలనంగా మారింది. పైగా, పోలీసుల విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. దీంతో టీడీపీ నేత వినోద్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలలుగా ఆ బాలికను వినోద్ వేధిస్తూ వచ్చాడని, అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments