Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (14:25 IST)
కమ్మోళ్లపై ఉన్న ద్వేషంతోనే అమరరాజా ఫ్యాక్టరీని రాష్ట్రం నుంచి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరిమేశారని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అలాగే, జగన్ ఓదార్పు యాత్రలకు వెళ్ళినట్టుగా లేదని, ఒక యుద్ధానికి వెళ్లినట్టుగా ఉందన్నారు. 
 
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై కన్నా గురువారం విలేకరులతో మాట్లాడుతూ, జగన్ పర్యటన ఓదార్పు యాత్రలాకాకుండా పల్నాడుపై యుద్ధానికి వెళ్లినట్టుగా ఉందన్నారు. నాగమల్లేశ్వర రావు మృతికి 100కు వంద శాతం జగన్మోహన్ రెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. పోలీస్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడం అవాస్తమని అన్నారు.
 
పల్నాడులో అరాచక ర్యాలీ నిర్వహించారు. ఈ పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను బయటకురాకుండా అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. కమ్మవారిపైనే ద్వేషంతోనే అమరరాజా బ్యాటరీ పరిశ్రమను రాష్ట్రం నుంచి తరిమేశారని, అమరావతిని నాశనం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments