అవును మీరు చదువుతున్నది నిజమే. అయితే ఈ ప్రశంసలు ఇప్పటివి కావు. గత ప్రభుత్వకాలంలో జగన్ పరిపాలనపై పవన్ చేసిన కామెంట్స్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
జగన్‌ను ప్రశంసిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అత్యవసర సేవలను అందించే అంబులెన్స్‌లను ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. అలాగే కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం పనిచేసిన తీరును అభినందించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అద్భుతంగా పని చేసిన దాని పైన కూడా బురద చల్లడం జగన్ వంతు అని.. పవన్ కల్యాణ్ హుందాగా వ్యవహరించి జగన్‌ను కొనియాడటం ఆయన వ్యక్తిత్వమని నెటిజన్లు ట్వీట్ చేశారు. మీ ఎన్డీయేలో భాగస్వామి పవన్ కల్యాణ్ ఈ సేవల గురించి పొగిడారో చూడండి అంటూ జగన్‌కు చురకలు అంటించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.