Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు : మేనిఫెస్టో రూపకల్పనకు కమిటీ

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (10:28 IST)
వచ్చే ఏడాది  ఏపీ శాసన సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీల నేతలు అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం ఇరు పార్టీల నేతలతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో టీడీపీ తరపున యనమల, పట్టాభి, అశోక్ బాబులు ఉండగా, జనసేన పార్టీ తరపున వరప్రసాద్, శశిధర్, శరత్‌లకు చోటు కల్పించారు. ఈ మేనిఫెస్టో కమిటి ఈ నెల 13వ తేదీన తొలిసారి భేటీకానుంది. 
 
కాగా, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పాయింట్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లింది. పొత్తు అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం పేరిట మరో 6 అంశాలను ప్రతిపాదించారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఈ ఆరు ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా మేనిఫెస్టోకు రూపకల్పన చేయనుంది. 
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నాలుగో జట్టుగా అర్హత సాధించిన కివీస్.. భారత్‌తో పోరు... 
 
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. పది జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య ఆదివారం జరుగనుంది. ఆ తర్వాత సెమీస్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నాకౌట్ పోటీలకు నాలుగు జట్లు అర్హత సాధించాయి. వీటిలో భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ సెమీస్ పోటీల్లో తలపడే జట్లు కూడా ఖరారైపోయాయి. తొలి సెమీస్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 15వ తేదీన జరుగనుంది. 
 
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో నిలిచిన కివీస్‌తోనూ, పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతి భారీ విజయం సాధిస్తే పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. చివరకు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 338 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. 43.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఈ టోర్నీ పూర్తికముందే పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ సెమీస్ స్థానం ఖరారైంది.
 
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఖాతాలో 16, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఖాతాల్లో 14, న్యూజిలాండ్ ఖాతాలో 10 చొప్పున పాయింట్లు ఉన్నాయి. ఇపుడు పాక్ నిష్క్రమణ నేపథ్యంలో కివీస్ నాలుగు జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లలో గెలుపొంది, 10 పాయింట్లను సొంతం చేసుకుంది. 
 
దీంతో ఈ నెల 15వ తేదీన ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంకానుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. దీంతో 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా ఈవెంట్ ముగుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments