హర్యానాలోని పానిపట్‌లో నలుగురు సభ్యుల ముఠా అకస్మాత్తుగా ఆయుధాలు, కత్తులు, పదునైన బ్లేడ్లతో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోకి ప్రవేశించిన ముఠా మహిళలు తప్ప మిగతా కుటుంబ సభ్యుల చేతులు కట్టేసి.. శబ్దం చేస్తే చంపేస్తామని బెదిరించారు.
దీంతో భయాందోళనకు గురైన వారు శబ్దం చేయలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగలు, డబ్బు దోచుకెళ్లిన ముఠా పారిపోయింది.
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మరోచోట కూడా దోపిడీ జరిగింది. భార్యాభర్తలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముఠా.. భర్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. ఆరోగ్యం బాగాలేని భార్య భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో యువతిపై గుంపు దాడి చేసింది.
గాయపడిన మహిళ మృతి చెందింది. అలాగే కిడ్నాప్‌కు గురైన భర్త నుంచి డబ్బు, మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనల్లోనూ ఒకే ముఠా హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరగడంతో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.