రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పంచాయతీ : జగన్‌పై బాబు ధ్వజం

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:23 IST)
రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పంచాయతీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన శుక్రవారం తూగో జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాను. 
 
కార్యకర్తలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ వైకాపా ప్రభుత్వ బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పునరావాస నిధిని ఏర్పాటు చేసాం. దుర్మార్గమైన, రాక్షస పాలన ఇంత వరకు ఎక్కడ చూడలేదు. 
 
వైఎస్, విజయభాస్కర్ రెడ్డి ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినప్పటికీ వారు దాన్ని పరిమితం చేసారు. మిగతా జిల్లాల్లో హుందాగా ఉన్నారు. కాని జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా చేయాలని చూస్తున్నారు. ఇంత పనికిమాలిన ప్రభుత్వం నా 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చూడలేదు. 
 
వైసిపి కు క్యాడర్ లేదు. అందుకే టిడిపి క్యాడర్‌ను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. నా మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, సెక్యూరిటీని తగ్గించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పాద యాత్రకు పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇచ్చాము.
 
 నా ఇళ్లు ముంచి రాజకీయాలు చేసి అప్రదిష్ట పాలయ్యారు. తూర్పుగోదావరి వంటి ప్రశాంతమైన జిల్లాలో కూడా రౌడీయిజం చేస్తున్నారు. తమ ఇంట్లో తాము ఉండటానికి కూడా పోరాటం చేస్తున్నారు. క్రింది స్థాయిలోని పోలీసులకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
 
ఐపీఎస్‌లు కూడా ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారు. న్యాయం అడిగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అటువంటి పోలీసులు ఉన్నా ఒకటే లేక పోయినా ఒకటే అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments