Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు, లంచ్‌కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు.

Webdunia
బుధవారం, 1 మే 2019 (17:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ ఫ్రస్ట్రేషన్‌ పతాక స్థాయికి చేరిందని మండిపడ్డారు. మోడీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహించారు. బాలాకోట్‌ను పదేపదే ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్టుందని ఎద్దేవా చేశారు. 
 
చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, దేశంలో విపక్షాల ఉనికి లేకుండా చేయాలని మోడీ చూస్తున్నారని మండిపడ్డారు. గంటకో డ్రెస్‌ మార్చి ఆర్భాటంగా మోడీ రాజకీయాలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు, లంచ్‌కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు వేస్తున్నారన్నారు. మోడీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనబడుతోందంటూ సెటైర్లు వేశారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు చాలా రాష్ట్రాల్లో సరిగా పని చేయడం లేదన్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయన్నారు. ఈవీఎంల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశారని... ఇప్పుడు అదే ఈవీఎంలను ఆయన సమర్థిస్తున్నారని మండిపడ్డారు. 
 
పశ్చిమబెంగాల్ లో ఏడు దశల్లో ఎన్నికలు పెట్టడం దారుణమని... హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పోరాటం వల్లే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు 5 శాతానికి పెరిగిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి పడ్డాయని తెలిపారు. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పారు.
 
తుఫాను విషయంలో కోడ్‌ మినహాయింపు ఇవ్వాలని పలు రాష్ట్రాల సీఎంలు ఈసీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రులను అడుక్కునే స్థాయికి దిగజార్చారని ఫైరయ్యారు. ప్రధానికో రూలు... సీఎంలకు ఒక రూలా?, ముఖ్యమంత్రులు తుఫాన్లు వచ్చినా సమీక్ష చేయొద్దా?, ప్రధాని ఏదైనా మాట్లాడొచ్చా?.. రాజకీయాలు చేయొచ్చా?, ప్రధానికి ఏ కోడ్‌ అడ్డురాదా..?, ప్రజల కోసం పోరాడే మాకు మాత్రం కోడ్‌ ఉంటుందా? అని ప్రశ్నించారు.
 
ఇకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రెస్‌మీట్ పెట్టనివ్వలేదని నన్ను ప్రశ్నిస్తాడు. అది ఎలక్షన్ కమీషన్‌కు సంబందించినది. వెళ్లి వాళ్ళని అడగాలి. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు. అదేమైనా కొత్త సినిమానా.. ఆల్రెడీ తెలంగాణలో విడుదలైన సినిమానే కదా ఇక్కడ విడుదల చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments