Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ పీఎంవి తెలిసీ తెలియని మాటలు.. స్వరూపానందేంద్ర స్వామి ఫైర్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:28 IST)
Swami Swaroopanandendra
భార‌త భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు త‌మ‌వేనంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ గతంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కోట్లాది మంది భారతీయులు కొలిచే శ్రీ రాముడు ఓ నేపాలీ అని, ఆయన సతీమణి సీత కూడా తమ దేశ అమ్మాయేనని నేపాల్ ప్రధాని శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా శ్రీరాముడు జన్మస్థానంగా చెప్పుకునే అయోధ్య... తమ దేశంలోనే ఉందన్నారు. 
 
అయితే శ్రీరాముని జ‌న్మ‌భూమిపై నేపాల్ ప్ర‌ధాని ఓలీ చేసిన వ్యాఖ్య‌ల‌ను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. శ్రీరాముని జ‌న్మ‌స్థ‌లం గురించి తెలిసీ తెలియ‌ని మాట‌లు స‌రికాద‌ని పేర్కొన్నారు. 
 
రాముడు భార‌త‌దేశంలో జ‌న్మించాడ‌నేందుకు ఎన్నో చారిత్ర‌క సాక్ష్యాలున్నాయ‌ని వాటిని వ‌క్రీక‌రించ‌డం స‌బబు కాదని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. చైనా ప్ర‌ధాని కుట్ర‌ల‌కు అనుగుణంగా నేపాల్ ప్ర‌ధాని న‌డుచుకోవ‌డం దారుణ‌మన్నారు. 
 
ఇక‌నైనా నేపాల్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. భార‌త్‌లో జ‌న్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమ‌న్నారు. ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితాన్ని స‌మాజానికి అందించిన దివ్య‌మూర్తి శ్రీరాముడ‌ని కొనియాడారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments