Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడి చేసి చంపేశారు.. వైఎస్ వివేకా మృతిపై వైఎస్ అవినాశ్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:00 IST)
తన పెద్దనాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్. అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెదనాన్నపై ఎవరో దాడి చేసి చంపేశారని ఆరోపించారు. అందువల్ల ఈ దాడిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన పోలీసులను కోరారు. 
 
శుక్రవారం తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి తమ ఇంట్లోని బాత్రూమ్‌లో రక్తపుమడుగులో పడివున్న విషయం తెల్సిందే. పైగా, ఆయన తలపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తమల్ని తీవ్రంగా కలచి వేసిందన్న అవినాష్... పెదనాన్న తలపై రెండు గాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాత్ రూములో కాలుజారిపడితే తలకు వెనుకవైపు లేదా ముందు వైపు మాత్రమే గాయం అవుతుందని, రెండు వైపులా గాయం అయ్యే పరిస్థితే ఉండదన్నారు. అవి పెద్ద గాయాలని, చేతిపైనా, ముఖంపైనా గాయాలున్నాయని ఆయన అన్నారు. 
 
ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments