Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టరుతో నర్సు ఎఫైర్, వైద్యుడి భార్య నర్సుకి సూదులతో టార్చర్పె

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (16:58 IST)
ఓ మహిళా వైద్యురాలు పైశాచికంగా ప్రవర్తించింది. తన భర్తతో ఓ నర్సు అక్రమ సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో చిత్రహింసలకు గురిచేసింది. ముఖ్యంగా, నర్సుపట్ల మహిళా వైద్యురాలు దాష్టీకం ప్రదర్శించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయలక్ష్మి అనే మహిళ ఓ వైద్యురాలు. ఈమె భర్త రామకృష్ణ సూర్యాపేటలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. భార్యాభర్తలు అదే ఆస్పత్రిలో వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. 
 
అదే ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులతో తన భర్త వివాహేతర సంబంధం నడుపుతున్నాడన్న అనుమానం విజయలక్ష్మికి కలిగింది. ఇదే విషయంపై ఆస్పత్రిలో పని చేసే నర్సులకు, వైద్యురాలికి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ అనుమానంతోనే కొన్ని రోజుల క్రితం కొందరు మహిళా నర్సులను విధుల నుంచి తొలగించారు కూడా. 
 
ఈ క్రమంలోనే ఈనెల 6న వైద్యురాలు భర్త లేని సమయంలో నర్సులు సునీత, ప్రమీలను పిలిపించి చైర్లో కూర్చోపెట్టి బంధించింది. యాసిడ్, పినాయిల్‌తో బెదిరించి సూదులతో గుచ్చి, గుచ్చి ఆపరేషన్ చేసే కత్తులతో గొంతుపై పెట్టి  హింసించింది. తన భర్తతో లైంగిక సంబంధం ఉందా లేదా? అని ప్రశ్నిస్తూ సునీతపై బీభత్సం సృష్టించింది. 
 
అక్రమ సంబంధం ఉంటే మానుకోవాలని భయబ్రాంతులకు గురి చేసింది. కొన్ని గంటల పాటు వైద్యురాలు సునీతపై దాడి చేస్తూ ఉండడంతో ఏమీ చేయలేక అక్కడే ఉన్న తోటి నర్సు ప్రమీల, ఆండాళ్ అలాగే ఉండిపోయారు. సుమారు ఆరు గంటల తర్వాత సునీత తోటి నర్సుల సహాయంతో తప్పించుకొని వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం