Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (13:42 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ ఇద్దరు న్యాయమూర్తులు విభన్నమైన తీర్పులను వెల్లడించింది. అదేసమయంలో త్రిసభ్య ధర్మాసనానికి పంపించాలని ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేసింది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా నేతృత్వంలోని ధర్మాసనం 17ఏ పై భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును వెలువరించింది. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్‌ 17ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామంటూ తీర్పును వెలువరించారు. గతంలో జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని, చట్టం వచ్చిన తర్వాతే 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పునివ్వగా, చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుధ్ బోస్ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments