Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఎక్స్ 100' ప్రభావం.. పెట్రోల్ ఒకరిపై ఒకరు పోసుకుని నిప్పంటించుకున్నారుయ...

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి మిస్టరీ వీడింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వీరిద్దరు మరో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం సాగించారు.

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2018 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి మిస్టరీ వీడింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వీరిద్దరు మరో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం సాగించారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి మందలించారు. ప్రేమమత్తులో ఉన్న ఆ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసే బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ కొనుగోలు చేసుకుని వచ్చారు.
 
మద్యం సేవించిన మత్తులో ఒకరి‌పై ఒకరు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు ఓ సినిమాలోని సన్నివేశాలు ప్రభావితం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి ఆత్మహత్యలు పూర్తిగా ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. 
 
ఇదే అంశంపై పోలీసులు స్పందిస్తూ... పట్టణానికి చెందిన మహేందర్‌, రవితేజలు ఇటీవల వచ్చిన ఓ సినిమాలో ఉన్న సన్నివేశాలకు ప్రభావితమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇద్దరు కలిసే పెట్రోల్‌ కొనుగోలు చేసుకుని మిషన్‌ కాంపౌండ్‌లోకి వెళ్లి మద్యం సేవించి ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
 
గతంలో కొంత మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నవారిలో రవితేజ కూడా ఉన్నాడని అన్నారు. ప్రస్తుతం 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వీరి స్నేహితులతో పాటు మరికొంత మందిని విచారించామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments