నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్‌పై కత్తితో దాడి

ఠాగూర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (15:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా నూజివీడులో ఉన్న ట్రిపుల్ ఐటీకి చెందిన ప్రొఫెసర్‌పై ఓ విద్యార్థి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ప్రొఫెసర్ గాయపడ్డాడు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. సక్రమంగా ల్యాబ్‌కు హాజరుకాని విద్యార్థిని ఎంటెక్ డిపార్టుమెంట్ ఇన్‌చార్జి, ప్రొఫెసర్ గోపాలరాజు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తితో దాడికి దిగాడు. వెంటనే సహచర సిబ్బంది ఆయనను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
సీఎం రేవంత్ ‌రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. పరువు నష్టం దావా కొట్టివేత! 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ దాఖలుచేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను అపెక్స్ కోర్టు సోమవారం కొట్టివేసింది. రాజకీయపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. 
 
గత ఎన్నికల ప్రచర సమయంలో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణ బీజేబీ శాఖ పరువు నష్టం దావా వేసింది. తొలుత ఈ కేసును తెలంగాణ హైకోర్టుల దాఖలు చేయగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలకు సంబంధించిన వివదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ పరువు నష్టం దావా కేసులో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఊరట లభించినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం