Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 23 March 2025
webdunia

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

Advertiesment
arrest

ఠాగూర్

, గురువారం, 20 మార్చి 2025 (23:21 IST)
విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై హథ్రాస్‌‍లోని సేథ్‌పూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్‌గా పని చేస్తున్న రజినీష్ కుమార్ (50)ను పోలీసులు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లోని అరెస్టు చేశారు. చాలా సంవత్సరాలుగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో అతడిని ప్రత్యేక పోలీసు బృందాలు గాలించిపట్టుకున్నాయి. 
 
పోలీసుల విచారణలో రజినీష్ కుమార్‌‍ నేరాన్ని అంగీకరించాడు. 2009లో ఒక విద్యార్థిని లైంగిక దాడి చేయగా, అది వెబ్‌కెమెరాలో రికార్డు అయిందని, ఆ తర్వాత విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన వచ్చిందని చెప్పారు. పరీక్షల్లో ఎక్కువగా మార్కులు వేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి లంచాలు కూడా తీసుకున్నట్టు అంగీకరించాడు. మహిళలపై లైంగిక దాడి దృశ్యాలను రికార్డు చేసేందుకు తన కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న హథ్రాస్ ఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి 65 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 
 
రజినీష్ కుమార్ 1996లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి పిల్లలు లేరు. 2001లో బాగ్లా కళాశాలలో అధ్యాపకుడిగా చేరి గతయేడాది చీఫ్ ప్రొక్టర్‌గా పదోన్నతి పొందాడు. ఈ కేసులో పోలీసులను మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది విద్యార్థినులపై అత్యాచారం చేశాడో తెలియదని రజినీష్ పోలీసులకు చేప్పినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్