Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

Advertiesment
professor ravi

ఠాగూర్

, గురువారం, 27 మార్చి 2025 (12:15 IST)
నిత్యం తరగతి గదిలో సీరియస్‌గా పాఠాలు బోధించే ఓ లెక్చరర్‌ సరదాగా స్టెప్పులేస్తే, అదికూడా మైఖేల్ జాక్సన్ పాటకు కాలుకదిపితే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఉంటుంది. అచ్చంగా మైఖేల్ జాక్సన్ దిగి వచ్చినట్టు తమ లెక్చరర్ డ్యాన్స్‌ చేయడం చూసి విద్యార్థులు ఉత్సాహం పట్టలేకపోయారు. క్లాస్ రూమ్ దద్దరిల్లిపోయాలా ఈలలు, చప్పట్లతో ఎంకరేజ్ చేశారు. బెంగుళూరులోని న్యూ హారిజాన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్రొఫసర్ రవి చేసిన ఈ డ్యాన్స్‌ను ఓ విద్యార్థి వీడియో తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. 
 
దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు 2 లక్షల మంది ఈ వీడియోకు లైక్ కొట్టగా 27 లక్షల మందికి పైగా వీక్షించారు. రవి సార్ జోష్ ఏమాత్రం తగ్గలేదంటూ ఆయన పూర్వ విద్యార్థులు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు.. మంచి లెక్చరర్ కూడా అని ఆయన శిష్యులు కావడం తమ అదృష్టమని కామెంట్లలో చెబుతున్నారు. మరో యూజర్ కాస్త ఫన్నీగా స్పందిస్తూ.. రవి సార్ క్లాస్‌కు ఆ రోజు ఒక్క విద్యార్థి కూడా మిస్ అయి ఉండరని కామెంట్ చేశాడు. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AJ (@ajdiaries___)


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..