Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఏపి డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (20:10 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పర్యటిస్తున్నట్లు చెప్పారు.

మంగ‌ళ‌గిరిలోని పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్న‌ట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో పెట్రోలింగ్‌ జరుగుతోంద‌ని తెలిపారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తాం అన్నారు.

రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ ఇస్తామ‌ని, సామాజిక మాధ్యమాలపై కూడా దృష్టి పెట్టనున్న‌ట్లు పేర్కొన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు డీజీపి వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments