Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికకు వేధింపులు.. శరీరంపై వాతలు పెట్టిన సవతి తండ్రి.. ఎందుకు..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (10:17 IST)
నేటి తరుణంలో వేధింపులు ఎక్కువైపోతున్నాయి. చిన్న పెద్దా అనే తేడా లేకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తండ్రిగా ఉండాల్సిన వారు కూడా ఇలా చేస్తున్నారు. ఆరేళ్ల పాపను సవతి తండ్రి వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరిలో చోటుచేసుకుంది.  గోదావరి జిల్లాకు చెందిన సుజాత అనే మహిళ భర్త చనిపోవడంతో తన ఆరేళ్ల కుమార్తెతో జీవనం సాగిస్తోంది.
 
వీరిద్దరి మధ్యలో ఆరేళ్ల చిన్నారి అడ్డుగా ఉండడంతో బర్కత్ అలీ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దాంతో ఆమెను ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం బర్కత్ అలీ ఆ చిన్నారిపై ఆగ్రహంతో అట్లకాడను కాల్చి శరీరంపై పలుచోట్ల వాతలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు ఛైల్డ్ లైన్‌కు ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు.
 
ఆ తరువాత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బాలల సంక్షేమ కమిటీ రాష్ట్ర సభ్యుడు వి.గాందీ బాబు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మశ్రీ.. అడిషనల్ డీఅండ్ఎంహెచ్ఓ డాక్టర్ కోమలి ఆ బాలికను పరిశీలించారు. చిన్నారి శరీరంపై కాలిన గాయాలు, మచ్చలు ఉన్నాయి. ఈ ఘటనపై నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. దాంతో బర్కత్ అలీపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. ఇక టూ టౌన్ సీఐ పవన్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments