Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించండి: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (17:16 IST)
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోని సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న సంగతి ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలని తెలిపారు.
 
ఈ రోజు ఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను జగన్ పరిశీలించారు. ఆ సందర్భంగా సెప్టెంబరు 5 నుండి పాఠశాలలు ప్రారంభించాలని ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు.
 
ప్రతి స్కూల్లో పెయింటింగ్స్ బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాలలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని చర్యలను చేపడుతున్నామని తెలిపారు. కాగా రోజూ 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంలో నెలరోజుల్లో ఈ సంఖ్య కిందికి వస్తుందా అనే సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments