Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్... ఈవిడి సైకిల్‌కు ఓటేస్తుందట... ఏంటో చూడండి : మంత్రి ధర్మాన

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (08:32 IST)
వైకాపా ప్రభుత్వ ఇచ్చే సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ఓ మహిళ సైకిల్ ఓటు వేస్తానని మంత్రి ధర్మాన ప్రసాద రావుకు చెప్పింది. అంతే.. ఆయన ఒకింత షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న వలంటీర్‌ను పిలిచి.. "ఏయ్... ఈవిడ సైకిల్‌కు ఓటేస్తుందట.. ఏంటో చూడండి" అంటూ వ్యాఖ్యానించారు. 
 
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రం అందిస్తూ ఏ పార్టీకి ఓటేస్తావని అడిగారు. 'సైకిల్‌కు వేస్తా' అని ఆమె చెప్పడంతో మంత్రి ఖంగుతిన్నారు. 'ఏయ్‌ చూడండి.. ఈవిడ సైకిల్‌కు ఓటేస్తుందట' అని మంత్రి అసహనంతో గట్టిగా అనడంతో అక్కడున్న నాయకులు ఏమవుతుందోనని ఉత్కంఠగా చూశారు. 
 
ఆ తర్వా మంత్రి ధర్మాన మాట్లాడుతూ, ఎవరికైనా ఓటేసుకోవచ్చు. కానీ, గోతిలో పడిపోతారు జాగ్రత్త అని చెప్పారు. ఈ కార్యక్రమం నుంచి ఆదిలక్ష్మి బయటకు రాగానే ఆ ప్రాంత వాలంటీర్లు, వైకాపా నాయకులు చుట్టుముట్టి అలా ఎందుకు చెప్పావని మందలించారు. దీంతో ఆదిలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ.. 'జగన్‌ చిన్నవాడు.. అధికారంలోకి వచ్చాక ఎలా పరిపాలిస్తాడో అనుకున్నా. కానీ అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసేందుకు మళ్లీ హామీలు ఇస్తున్నారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments