Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగుపురం పి.హెచ్.సిలో వాక్సిన్ తీసుకున్న శ్రీకాకుళం ఎస్పీ

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (17:21 IST)
కోవిడ్ వాక్సిన్‌న శ్రీకాకుళం పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ సింగుపురం పి.హెచ్.సిలో తీసుకున్నారు. ఏ.ఎన్.ఎమ్ రోజారాణి ఎస్.పికి వాక్సిన్ వేశారు. ఫ్రంట్ లైన్ కోవిడ్ వర్కర్లకు వాక్సినేషన్‌లో భాగంగా బుధవారం పోలీసు శాఖకు వాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. సింగుపురం పి.హెచ్.సిలో సింగుపురం పి.హెచ్.సిలో ఎస్.పి అమిత్ బర్దార్ తో పాటు ఏ.ఎస్.పి టి.పి.విఠలేశ్వర్, ఎస్.ఇ.బి ఏ.ఎస్.పి కంచి శ్రీనివాసరావు, డి.ఎస్.పి జి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ పి.వి.రమణ తదితరులు వాక్సిన్ ను తీసుకున్నారు.
 
వాక్సిన్ తీసుకున్న అనంతరం ఎస్.పి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవి షీల్డ్ వాక్సిన్ తీసుకోవడం జరిగిందని అన్నారు. వాక్సిన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాక్సిన్ కు పేరు నమోదు చేసుకున్న క్రమంలో సింగుపురం పి.హెచ్.సిలో వాక్సినేషన్ కు పేరు వచ్చిందని చెప్పారు. వాక్సిన్ తీసుకొనుటకు ప్రాధాన్యత క్రమం ఉండదని, అందరూ సమానమేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని ఆయన అన్నారు. 
 
వాక్సిన్ తీసుకొనుటకు భయం అవసరంలేదని పేర్కొన్నారు. అయితే వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. వాక్సిన్ తీసుకునే ముందు రోజు మంచి నిద్ర ఉండాలని, వాక్సిన్ అనంతరం తగిన విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. 
 
కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 2వ సారి, 3వ సారి లాక్డౌన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నట్లు గమనించాలని పేర్కొన్నారు. దీని దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని సూచించారు. 
 
అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిపట్ల ప్రజలు అందరూ అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. దక్షిణాఫ్రికా తదితర కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు గమనిస్తన్నామని చెప్పారు. 
ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ డా.కె.సి.చంద్ర నాయక్, డి.ఐ.ఓ డా.ఎల్. భారతి కుమారి దేవి తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments