Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త నాకు నచ్చడంలేదు, నువ్వే కావాలంటూ ప్రియుడితో కలిసి...

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (16:50 IST)
పెళ్లయి ఇద్దరు  పిల్లలు. భార్య చెప్పిన మాట వినే భర్త.. ఇద్దరు పిల్లలు. అన్యోన్యమైన కుటుంబం. అయితే ఆ కుటుంబంలో అక్రమ సంబంధం చివరకు వారి ప్రాణాలను బలిగొంది. భర్తతో విసిగిపోయాను. నన్ను పెళ్ళి చేసుకో.. నీతోనే నేనుంటా అంటూ చెప్పిన వివాహిత ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా భర్తను చంపేసింది. 
 
అనంతపురం జిల్లా కదిరికి చెందిన నాగభూషణం.. ఈశ్వరమ్మలకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. నాగభూషణం మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈశ్వరమ్మ బాగా చదువుకుంది. ఎం.ఎ చేసిన ఈశ్వరమ్మ ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు.
 
భర్తను ఒప్పించి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరింది. తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే ఆ స్కూల్లో రవికుమార్ అనే వ్యక్తితో ఈశ్వరమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం భర్తకు తెలిసింది.
 
భార్యమీద ఎంతో ప్రేమ ఉన్న భర్త మందలించాడు. మరోసారి ఇలాంటివి వద్దని చెప్పాడు. అయినా ఆమె మారకపోగా ఏకంగా ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. ఇద్దరు పిల్లలను ఇంట్లో నుంచి బంధువుల ఇంటికి పంపించింది. ప్రియుడిని రాత్రి వేళలో ఇంటికి పిలిపించుకుంది.
 
నిద్రపోతున్న భర్తను ఇద్దరూ కలిసి చంపేశారు. దిండును ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తరువాత మృతదేహాన్ని కదిరి ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో పూడ్చేశారు. ఏమీ ఏరుగనట్లు ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. వారంరోజుల పాటు బంధువులకు తన భర్త చెన్నై పనిమీద వెళ్ళారని.. అక్కడ బిల్డింగ్ పనిచేస్తున్నాడని చెప్పింది.
 
ఈశ్వరమ్మ అలా చెప్పడంతో అనుమానంతో ఆమె భర్త సెల్‌కు ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్‌ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఈశ్వరమ్మ చెప్పింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments