కరోనా నుంచి వ్యాక్సిన్ టీకా కాపాడుతుందని అందరూ వేసుకుంటున్నారు. అయితే కరోనా టీకా వల్ల బతుకుతామో లేదో కానీ కొంతమంది అస్వస్థలకు గురవుతుంటే మరికొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బొక్కా విజయలక్ష్మికి ఈ నెల 19వ తేదీన కరోనా వ్యాక్సిన్ వేశారు. రెండు రోజులు ఆమె బాగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు.
21వ తేదీన తెల్లవారుజామున చలి జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈరోజు తెల్లవారుజామున ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఐతే ఆమె కరోనా వ్యాక్సిన్ కారణంగానే చనిపోయిందా లేదా మరింకేదైనా అనేది తేలాల్సి వుంది.