Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరులో కలకలం : కరోనా టీకా వేయించుకున్న ఆశా వర్కర్ కన్నుమూత!

గుంటూరులో కలకలం : కరోనా టీకా వేయించుకున్న ఆశా వర్కర్ కన్నుమూత!
, ఆదివారం, 24 జనవరి 2021 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుల కలకలం చెలరేగింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ ఆశా వర్కర్ బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)లకు ఈ నెల 20న వ్యాక్సిన్ వేశారు. 
 
టీకా తీసుకున్న తర్వాత లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ వచ్చాయి. విజయలక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఇద్దరినీ 22వ తేదీన గుంటూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
ఇందులో చికిత్స తర్వాత లక్ష్మి ఆరోగ్యం కుదుటపడింది. దీంతో త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంతలోనే శనివారం రాత్రి విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురైనట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది. కాగా, విజయలక్ష్మికి వేసిన టీకా వయల్ నుంచే మరో డాక్టర్ కు వ్యాక్సిన్ వేసినా, అతనిలో ఎటువంటి రియాక్షన్ రాలేదని తెలుస్తోంది.
 
విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, జీజీహెచ్ కి చేరుకుని ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరికి ఏ టీకా వేరియంట్‌ను ఇచ్చారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్నా చేసిన విద్యార్థులపై అత్యాచారం కేసు... ఎక్కడ?