Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సీన్లోకి శ్రీరెడ్డి.. రాపాక మీరు కేక.. పవన్‌ వార్నింగ్‌ను లైట్‌గా తీసుకున్నారే!

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (16:56 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ సీన్లోకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన శ్రీరెడ్డి.. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి సినీ అవకాశాలతో బిజీ బిజీగా వుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. తాజాగా శ్రీరెడ్డి జనసేన ఎమ్మెల్యే రాపాక గురించి ఓ పోస్టు చేసింది. 
 
తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ''రాపాక మీరు కేక'' అంటూ పోస్టు చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు రాపాక వరప్రసాదరావు అసెంబ్లీలో మద్దతు పలకడాన్ని శ్రీరెడ్డి స్వాగతించింది. 
 
ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించాలని, ఒకవేళ దానిపై ఓటింగ్ నిర్వహిస్తే అందుకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే, అధినేత లేఖను లైట్ తీసుకున్న రాపాక వరప్రసాద్ తాను మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరెడ్డి రాపాక వరప్రసాద్ మీద ''రాపాకా.. మీరు కేక'' అని కామెంట్ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments