టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శులకు బుధవారం ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఒక్కొక్కరికి, ఐదు లోక్ సభ నియోజకవర్గాల చొప్పున ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.
మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ లోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.