Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసని తుఫాను ఎఫెక్టు - పలు రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

Webdunia
బుధవారం, 11 మే 2022 (09:31 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది వాయువ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలో  పశ్చి మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశఁ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కూడా ఆరు రైళ్లను రద్దు చేశారు. 
 
నేడు రద్దు చేసిన రైళ్ళలో గుంటూరు రైపల్లే, రేపల్లే గుంటూరు, గంటూరు రేపల్లే, రేపల్లే గుంటూరు, రేపల్లె తెనాలి, కాకినాడ పోర్టు విశాఖపట్టణం, విశాఖపట్టణం కాకినాడ పోర్టు రైళ్లు ఉన్నాయి. అలాగే, గుంటూరు రోడు - డోన్ రైలును రీషెడ్యూల్ చేశారు ఈ రైలు బుధవారం మధ్యాహ్నం  ఒంటి గంటకు బయలుదేరాల్సివుండగా, మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు, తుఫాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, అసని తుఫాను గురువారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments