Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 రోజులు జనాలు గోల గోల.. తిండి తినని నాగుపాము.. చనిపోయింది..

కుమారస్వామి పామురూపంలో వచ్చాడనే నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగుపామును ప్రజలంతా కొలిచారు. కానీ ఆ నాగుపాము మృతి చెందింది. 27 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పాము గురించే అ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (16:14 IST)
కుమారస్వామి పామురూపంలో వచ్చాడనే నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగుపామును ప్రజలంతా కొలిచారు.  కానీ ఆ నాగుపాము మృతి చెందింది. 27 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పాము గురించే అందరూ చర్చించుకున్నారు. అయితే ఆ పాము మాత్రం అనారోగ్యం కారణంగా తిండి లేక, పడగ విప్పి ఆడుతూ ప్రాణాలు కోల్పోయింది. 
 
కానీ ఆ పాము బతికివున్న 27 రోజులు జనాలు దాన్నిచూసేందుకు వేల సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి ప్రతిరూపంగా స్థానికులు, నాగ భక్తులు పామును కొలిచారు. కానీ బుధవారం పామును ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ డాక్టర్లు పరీక్షించారు. అనారోగ్యంతో ఉందంటూ చికిత్స చేసేందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు
 
ఇంకా పామును అక్కడి నుంచి తీసుకెళ్లనివ్వకుండా స్థానికులు, భక్తులు అడ్డుకున్నారు. అయితే అధికారుల తీరువల్లే పాము చనిపోయిందని స్థానికులు ఆందోళన చేపట్టారు. 26 రోజుల క్రితం దుర్గాడలోని ఓ రైతు పొలంలో పడగ విప్పి నాట్యం చేస్తున్న పాముకు మహిమాన్విత శక్తులు ఉన్నాయని భావించారు. పాము ఎవరిపై దాడి చేయకుండా.. కనీసం కాటు వేసేందుకు కూడా ప్రయత్నించలేదు. దీంతో  స్థానికులంతా పూజలు చేయడం ప్రారంభించారు. 
 
ఆ సుబ్రహ్మణ్య స్వామే పాము రూపంలో తమ కష్టాలు తీర్చేందుకు వచ్చాడని నిత్యం పూజలు చేశారు. కానీ 27 రోజులు ఆ పాము పాలు కూడా ముట్టుకోలేదు. దీంతో ఆ పాము ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments